'ప్రతి నెలా అలాగే వైరల్ చేస్తున్నారు - ఆ వీడియోను ఎవరూ నమ్మొద్దు' - Chilkur Balaji Temple Fake Video - CHILKUR BALAJI TEMPLE FAKE VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 3:40 PM IST
Chilkur Balaji Temple Fake Video : కల్యాణం ఆలస్యం అవుతున్న వారు ఈ నెల 21న (నేడు) చిలుకూరు దేవస్థానానికి వస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై దేవస్థానం పండితులు రంగరాజన్ స్పందించారు. అలాంటి వార్తలను ఖండించారు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పారు. ఈ అసత్య ప్రచారంపై వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు.
ఏప్రిల్ 21 కోసం చెప్పిన వీడియోను ఎడిట్ చేసి, ప్రతి నెలా 21వ తేదీకి నాలుగు రోజుల ముందు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 21నే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కల్యాణోత్సవం నిర్వహించేశాం. ఆ కల్యాణోత్సవంలో పెళ్లికాని వారు పాల్గొన్నారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించాలి. అది అప్పుడే అయిపోయింది. మళ్లీ వచ్చే ఏడాదినే కల్యాణోత్సవం చేస్తాం. అలాంటి విషయాలను ఎవరూ నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.