మూడు రోజుల శిశువును కిడ్నాప్ చేసిన మహిళ - వీడియో వైరల్ - కరీంనగర్లో చిన్నపాప కిడ్నాప్ కేసు
🎬 Watch Now: Feature Video


Published : Feb 18, 2024, 8:25 PM IST
Child Kidnap Case in Karimnagar : పుట్టి మూడు రోజులు అవుతున్న ఓ శిశువును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆ పసిపాప తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆస్పత్రికి దగ్గరల్లో ఉన్న సీసీటీవీని పరిశీలించగా అపహరణ చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లోని ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన మనోజ్ రామ్, నిర్మల దంపతులు కరీంనగర్ జిల్లాలోని బావుపేట గ్రానైట్ పరిశ్రమలో జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో నిర్మల ప్రసూతి కోసం మూడు రోజుల క్రితం కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. అనంతరం ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
3 Days Baby Kidnap Viral Video : తండ్రి మనోజ్ తన బంధువుల అబ్బాయిని ఆ శిశువు దగ్గర ఉంచి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఆ శిశువు అపహరణకు గురైంది. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. అపహరణకు గురైన పాపను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి బంధువులా ఒక మహిళ వ్యవహరిస్తూ బయటికి తీసుకెళ్లినట్లు రికార్డు అయింది. కొద్దిసేపు ఆసుపత్రి ఎదుట ఉండి ఆ తర్వాత ఆటోలో వెళ్లిపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు.