బియ్యం గింజపై వినాయకుడి ప్రతిమ- వరల్డ్‌లోనే అతిచిన్న గణేశుడిగా రికార్డు! - World Smallest Public Ganapati - WORLD SMALLEST PUBLIC GANAPATI
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 12:45 PM IST
World Smallest Public Ganapati : వినాయక చవితి వచ్చిందంటే చాలు గణేశుడి విగ్రహాన్ని పెట్టేందుకు యువకులందరూ వివిధ రకాలుగా ఆలోచిస్తారు. ఆ ప్రాంతంలో తమ విగ్రహమే హైలైట్‌గా నిలవాలనుకుంటారు. మరికొందరు పర్యావరణహితం కోసం ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనే చేశారు మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని హడ్కో ప్రాంతంలోని కాలభైరవ ప్రతిష్ఠాన్ సభ్యులు. 8మి.మీ బియ్యం గింజపై గణేషుడి ప్రతిమను తయారు చేయించారు. ఈ గణపయ్యను దర్శించుకోవాలంటే టెలిస్కోపు సాయం తీసుకోవాల్సిందే.
అయితే, ఈ ప్రతిమ ప్రపంచంలోనే అతిచిన్న గణేషుడి విగ్రహంగా నిలిచింది. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. 6 మి.మీ మందం, 1.5 మి.మీ వెడల్పుతో ఉన్న గణపయ్య ప్రతిమను సిటీ ఆర్టిస్ట్ గజేంద్ర గద్దోంకర్ తయారుచేశారు. దీన్ని కేవలం 2 నిమిషాల 44 సెకన్లలో రూపొందించారు. గజేంద్ర బియ్యం, జొన్న, నువ్వు గింజలపై విభిన్న చిత్రాలను గీసి ఇప్పటికే పది రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వినాయక విగ్రహాన్ని తయారు చేసిన ఘనత తనకు దక్కడం సంతోషంగా ఉందని గజేంద్ర తెలిపారు. పర్యావరణహితం కోసమే ఇలా చిన్న గణేశ్ ప్రతిమను చేయించామని నిర్వాహకులు పేర్కొన్నారు.