జగన్​కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు - Chandrababu tours

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 7:57 PM IST

Chandrababu 'Ra Kadali Ra' Public Meeting: టీడీపీ- జనసేన పొత్తుతోనే వైసీపీ ఓటమి ఖాయమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగన్​ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉరవకొండలో జరిగిన 'రా కదలి రా' బహిరంగసభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా రాష్ట్రం నష్టపోయిందన్న చంద్రబాబు ప్రజలను చైతన్యం చేసేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. అనంతపురం జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. జగన్​కు కమిషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో విండ్ మిల్స్‌ చూసి ఆనందం కలిగిందని అన్నారు. మేం ఉన్నప్పుడు రాష్ట్రంలో కరెంట్ కొరత ఎప్పుడూ లేదని అన్నారు. టీడీపీ హయాంలో విండ్‌, సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కాని ఇప్పడు జగన్ కరెంట్ ఛార్జీలు పెంచి పేదల పొట్ట కొట్టారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.