LIVE:నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ- ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Naidu Public Meeting - CHANDRABABU NAIDU PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 4:19 PM IST
|Updated : Mar 29, 2024, 5:29 PM IST
Chandrababu Naidu Public Meeting in Nellore : నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం భహిరంగ సభలో పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చినట్లు చెబుతున్న సీఎం జగన్ తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. గురువారం కదిరిలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ క్యాలెండర్, కరెంటు ఛార్జీల తగ్గింపు, మెగా డీఎస్సీ, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్‌గా చేస్తే, జగన్ రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమికి మద్దతివ్వాలని కోరారు.
Last Updated : Mar 29, 2024, 5:29 PM IST