LIVE : సీఈవో వికాస్‌రాజ్ మీడియా సమావేశం - CEO VIKASH RAJ Live On Elections - CEO VIKASH RAJ LIVE ON ELECTIONS
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 2:07 PM IST
|Updated : Jun 1, 2024, 2:41 PM IST
CEO Vikas Raj Press Meet Live From Telangana State EC Office : లోక్‌సభ ఎన్నికల్లో కీలక భాగమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ ఫోల్స్ వెలవడే క్రమంలో నియమ నిభందనలు తెలియజేస్తున్నారు. ఎగ్జిట్ ఫోల్స్పై సరైన సూచనలు చేస్తున్నారు. ఇవాళ్టితో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4న మొదలవుతుందని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అలానే ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరగాలని చెబుతున్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వివరిస్తున్నారు.
Last Updated : Jun 1, 2024, 2:41 PM IST