పార్వతి బ్యారేజ్‌ను పరిశీలించిన నిపుణుల బృందం - ఇంజినీర్లను అడిగి వివరాలు సేకరణ - Expert Team Visit Parvathi Barrage - EXPERT TEAM VISIT PARVATHI BARRAGE
🎬 Watch Now: Feature Video
Published : May 23, 2024, 4:09 PM IST
Central Expert Team Visit Parvathi Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యారేజ్‌లు కుంగిపోవడానికి, మరమ్మతులు చేయడానికి కావల్సిన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్రం నుంచి నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్‌ను సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిపుణుల కమిటీ సందర్శించింది. బ్యారేజ్ కింద భాగంలో 61వ గేటు వద్ద కుంగిన గార్డర్లను బృందం పరీశిలించింది. అనంతరం కుంగిపోవడానికి గల కారణాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంది.
Expert Team Visit Parvathi Barrage in Peddapalli : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను బుధవారం ఈ నిపుణుల బృందం సందర్శించింది. అనంతరం ఆ రెండు బ్యారేజ్‌లు కుంగిపోవడానికి కారణాలను అధికారులను సేకరించింది. మహాదేవపూర్ నుంచి ఇవాళ పార్వతీ బ్యారేజ్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ కమిటీలో బృందంలో జే.ఎస్. ఎడ్ల బాడ్కర్(జియో టెక్నికల్), డాక్టర్ ధనుంజయ్ నాయుడు (జియో ఫిజికల్), డాక్టర్ ప్రకాష్ పాలయ్ (ఎన్డీటీ స్టడీస్) ఉన్నారు.