శ్రీకాకుళం జిల్లాలోనూ ఎయిర్పోర్ట్ - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు - Ram Mohan on Srikakulam Airport - RAM MOHAN ON SRIKAKULAM AIRPORT
🎬 Watch Now: Feature Video
Published : Oct 4, 2024, 10:49 AM IST
Central Minister Ram Mohan on Srikakulam Airport : ఏపీ అభివృద్ధి ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలోనే జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ మంజూరుకు కృషి చేస్తానని వివరించారు. ఇటీవల పాతపట్నంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వెనుకబడిన ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి చేసేందుకు ఐటీఐ కళాశాలను మంజూరు చేయనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మన్ వసతి గృహానికి మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. అలాగే పాతపట్నంలో ఉన్న సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు, కలెక్టర్ పాల్గొన్నారు.