CEC Live 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటన- ఈసీ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 3:00 PM IST

Updated : Mar 16, 2024, 4:31 PM IST

Central Election Commission Live : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించిన ఈసీ మరికాసేపట్లో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా లేదా అనే విషయమై ఈసీ స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ, స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు జరిపి షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్‌, మే 19 వరకు ఏడు విడతల్లో ముగిసింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.
Last Updated : Mar 16, 2024, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.