ETV Bharat / health

నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది? జ్వరం, తలనొప్పితో వాటర్ తాగొచ్చా? - WHEN WE SHOULD DRINK WATER

-ప్రతి రోజు ఏ సమయంలో నీరు తాగితే మంచిది? -నీటితో మెదడు పనితీరు మెరుగుపడినట్లు వెల్లడి

When we Should Drink Water
When we Should Drink Water (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 29, 2024, 4:26 PM IST

When we Should Drink Water: నీరు తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నీరు తాగడం వల్ల బరువు తగ్గుతుందని Nutrients జర్నల్​లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. Drinking Water and Weight Loss: A Systematic Review అనే అంశంలో Bharati Vidyapeeth Deemed University అసోషియేట్ ప్రొఫెసర్ అశ్విణ్ జోషి పాల్గొన్నారు. ఇంకా మెదడు పనితీరు మెరుగుపడి ఉత్సాహంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇలా అనేక ప్రయోజనాలు కలిగిన నీటిని తాగడానికి మంచి సమయం ఏది?

మరి నీటిని ఎప్పుడు తాగాలి?
ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు నీరు తాగటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, పొటాషియం లాంటి పోషకాలు సైతం లభిస్తాయన్నారు. ఫలితంగా రోజంతా హుషారుగా ఉండొచ్చని వివరించారు.

ఎటూ కాని సమయంలో ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తే ముందు కొన్ని నీళ్లు తాగటం మంచిదని చెబుతున్నారు. ఆకలి, దాహం రెండింటి ప్రేరేపకాలను మెదడు ఒకేలా గ్రహిస్తుందని.. కాబట్టే చాలాసార్లు ఆకలి, దాహం మధ్య తేడా తెలియదని వివరించారు. ఇలా నీళ్లు తాగిన కొద్ది నిమిషాల తర్వాత ఆకలి తగ్గితే దాహం వేసిందనే అర్థం చేసుకోవాలని తెలిపారు. ఫలితంగా అనసరంగా ఆహారం తీసుకోవడాన్ని అరికట్టొచ్చని అంటున్నారు.

ఇంకా విరేచనాలు, వాంతులు, జ్వరం మూలంగా శరీరంలో నుంచి చాలా నీరు బయటకు వెళ్లిపోతుంది. అయితే, వీటి లక్షణాలు ఆరంభమవుతున్న దశలోనే.. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జబ్బుల నుంచి త్వరగా కోలుకోవచ్చని అంటున్నారు. ఇంకా సాయంత్రం వేళల్లో నిరుత్సాహంగా అనిపించినప్పుడు చాలామంది కాఫీ, టీ తాగుతుంటారు. కానీ ఇలా కాకుండా ముందుగా ఓ గ్లాసు నీరు తాగటం మేలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తూ మూడ్‌ మెరుగవుతుందని అంటున్నారు.

తలనొప్పిగా అనిపించినప్పుడూ నీళ్లు తాగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కూడా తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండటానికి, కీళ్లు తేలికగా కదలటానికి సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుందన్నారు. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయని వివరించారు. కాబట్టి కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లి అలసట ముంచుకొస్తుందని వివరించారు.

అందరికీ 8 గ్లాసుల రూల్ వర్తించదట
అయితే, రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం అందరికీ ఒకేలా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరిగా అవసరం ఉంటుందున్నారు. అందుకే మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమని తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలని అంచనాకు రావొచ్చని వివరించారు. వాస్తవానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని అనేక అధ్యయనాలు సిఫారసు చేస్తున్నాయి. అయితే మనకు ఎంత నీరు అవసరమనేది ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుందన్నారు.

తగినంత నీరు తాగుతున్నామా?
అయితే మనం తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు అని నిపుణులు చెబుతున్నారు. మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలని.. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు తాగటం లేదనే అర్థం చేసుకోవాలన్నారు. నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగటం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనకు దాహం వేసే సరికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని వివరించారు. కాబట్టి అప్పుడప్పుడు గొంతు తడిచేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? వాటర్ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయట తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.