పెట్రోల్ బంకులో చోరీకి యత్నం - ఏం దొరక్కపోవడంతో ఆ దొంగ ఏం చేశాడంటే? - MOBILE THEFT IN MADHIRA PETROL BUNK - MOBILE THEFT IN MADHIRA PETROL BUNK
🎬 Watch Now: Feature Video
Published : May 12, 2024, 12:34 PM IST
Cell Phone Theft in Khammam Madhira Petrol Bunk Video : దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఏమీ దొరక్కపోవడంతో ఛార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌తో చోరీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంక్ యాజమాన్యం తెలిపిన ప్రకారం : మధిర నియోజకవర్గంలో సిరిపురం వద్ద హెచ్‌పీ పెట్లోల్ బంక్ ఉంది. అర్ధరాత్రి 1.20 గంటలకు బంకులోకి ఒక వ్యక్తి వచ్చాడు. పెట్రోల్ పోసే స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసి ఉంచాడు. చుట్టు పక్కల అంతా గమనించిన అతను బంకులో సిబ్బంది గదికి వెళ్లాడు. ఏమైనా దొరుకుతుందా అని గదంతా చూశాడు ఏమీ దొరక్క పోవడంతో అక్కడే టేబుల్‌పై ఛార్జింజ్ పెట్టి ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లాడు. ఈ ఘటన మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి దృష్యాలు సీసీ టీవీలో రికార్టు అయ్యాయి. వాటిని చూసిన బంకు యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని వ్యక్తిని గాలిస్తున్నారు.