YUVA : ఏఐ సాయంతో మూసీ సుందరీకరణ - సీబీఐటీ స్టూడెంట్స్ ఐడియా అదుర్స్ - YUVA ON MUSI BEAUTIFICATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 1:23 PM IST

CBIT Students On Musi River Beautification : హైదరాబాద్‌ మహానగరాన్ని మరింత సుందరీకరించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు మూసీని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. లండన్‌లోని థేమ్స్‌ రివర్ మాదిరిగానే హైదరాబాద్‌లోని మూసీని సుందరీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం గురించి తెలుసుకున్న సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తమ ఆలోచనలతో ఓ డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా మూసీ సుందరీకరణ పేరుతో నమూనా సిద్ధం చేశారు. 

ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ప్రాజెక్టు రూపకల్పన : ఈ నమూనాను ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో ప్రదర్శనగా ఉంచారు. ఏఐ, డ్రోన్‌ సాంకేతికతతో మూసీ ప్రక్షాళ వేగంగా చేయొచ్చని కార్యక్రమంలో వివరించారు. ఏఐ, డ్రోన్‌ సాంకేతికతలతో మూసీ శుభ్రంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే పూర్తి ప్రణాళిక సిద్ధం చేస్తాం అంటున్నారు. ఇంతకీ మూసీ సుందరీకరణలో సీబీఐటీ విద్యార్థులు కృత్రిమ మేథను ఎలా ఉపయోగించుకున్నారనే విషయాలను వాళ్ల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.