బస్సును ఢీకొని కారు దగ్ధం - అంతా క్షణాల్లోనే! - car and Bus Accident
🎬 Watch Now: Feature Video
Published : Feb 14, 2024, 7:05 PM IST
Car Fire Accident in Bhadradri Kothagudem : ఒకే రహదారిలో ప్రయాణిస్తున్న బస్సు, కారు ప్రమాదానికి గురైయ్యాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు- మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నిజాంపేట సమీపంలో ఇల్లందు వస్తున్న ఆర్టీసీ మినీ బస్సును అదే మార్గంలో వస్తున్న కారు వెనుక నుంచి ఢీ కొట్టింది(Car Accident). దీంతో కారు డ్రైవర్ రాంబాబు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో వాగ్వాదం చేసేందుకు కిందకి దిగాడు.
Car accident at Nizampet : కారు, బస్సు డ్రైవర్లు ఇద్దరు వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కారు నుంచి పొగలు రావడం గమనించారు. వారు చూస్తుండగానే కారు పెద్ద పెద్ద మంటలు చెలరేగి దగ్ధమయింది. ఈ ఘటన అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో షాక్‌లోకి వెళ్లిన రాంబాబు కాసేపటికి తేరుకుని ప్రాణాలు మిగిలాయని తనకు తాను సర్థి చెప్పుకున్నాడు.