కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ ప్రమాణ స్వీకారం - MLA Shri Ganesh Oath Ceremony - MLA SHRI GANESH OATH CEREMONY
🎬 Watch Now: Feature Video


Published : Jun 20, 2024, 2:30 PM IST
Cantonment MLA Shri Ganesh Oath Ceremony In Assembly : సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్తో ప్రమాణం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రులు శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీగణేశ్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన తర్వాత ఆ స్థానంలో ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికతో పాటు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.