స్వీట్​ షాప్​లోకి దూసుకెళ్లిన బస్సు- లైవ్​ వీడియో - Bus Accident in Tamil nadu - BUS ACCIDENT IN TAMIL NADU

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 8:22 PM IST

Bus Rammed Into Sweet Shop In Tamil Nadu : ప్రభుత్వ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం కొంత భాగం ధ్వంసం కాగా, ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తమిళనాడులోని దండిగల్ జిల్లాలో జరిగింది.  

దుండిగల్ బస్టాండ్ నుంచి థేని జిల్లాకు ఓ ఆర్​టీసీ బస్సు బయలుదేరింది. బస్టాండ్​ నుంచి బయటకు రాగానే అదుపు తప్పి ఎదురుగా ఉన్న ఉన్న ఓ స్వీట్ షాప్​లోకి దూసుకెళ్లింది. దీంతో స్వీట్ షాప్ ముందు భాగం ధ్వంసమైంది. దుకాణంలో ఉన్న మహిళ గాయపడగా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.  

150అడుగుల లోయలో పడ్డ యాత్రికుల బస్సు
జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము- పూంఛ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడి 22 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.