నడుచుకుని వెళుతున్న వారిపై ఆంబోతులు దాడి - వీడియో వైరల్ - bulls HULCHUL IN RAMAGUNDAM - BULLS HULCHUL IN RAMAGUNDAM
🎬 Watch Now: Feature Video
Published : Aug 16, 2024, 8:54 AM IST
Bulls Creat Panic in Ramagundam : రోడ్లపై నడుచుకుని వెళుతున్న వారిపై ఆంబోతులు దాడి చేసి వీరంగం సృష్టిస్తున్నాయి. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో జరిగింది. విఠల్ నగర్ పోస్టాఫీసు వద్ద రోడ్డుపై వెళుతున్న వారిపై దాడి చేయడంతో సుమారు 20 మంది వరకు గాయపడ్డారు. రోడ్లపై వందల సంఖ్యలో పశువులు సంచరించడంతోపాటు రాత్రి వేళల్లో రోడ్లపైనే పడుకోవడంతో చీకట్లో కనబడక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. గాంధీనగర్ వద్ద ఇటీవల మోటర్ సైకిల్‌పై వెళుతున్న ఓ యువకుడు గేదెను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భయాందోళనకు గురవుతున్న స్థానికులు : వారం రోజుల క్రితం రామగుండంలోని వ్యాపార కూడలి లక్ష్మినగర్‌లో రెండు ఆంబోతులు వీరంగం సృష్టించాయి. ఓ టీవీ షోరూంలోకి చొచ్చుకుపోయి టీవీలను ధ్వంసం చేశాయి. ఆంబోతులు రోడ్లపై సంచరించడంతోపాటు దాడి చేస్తుండడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు వాపోయారు. ఎన్ని ఘటనలు జరిగిన చర్యలు తీసుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతన్నారు.