రేషన్ లేదా ఆధార్ కార్డు ద్వారా వరద ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ - Budameru flood victims thank to CBN - BUDAMERU FLOOD VICTIMS THANK TO CBN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 3:58 PM IST

Budameru Flood Victims Thank to CM Chandra Babu : ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని విజయవాడ బుడమేరు వరద ముంపు బాధితులు అంటున్నారు. ప్రకృత్తి విపత్తు సమయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అభినందనీయమని కొనియడారు. వరద బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు ఉల్లిపాయాలు, మంచినూనె, కందిపప్పు, బంగాళదుంపలు, పాలు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుందని తెలిపారు. సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో మెబైల్ రేషన్ వాహనాల ద్వారా నగరంలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ద్వారా బాధితులకు పంపిణీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. విజయవాడ నగరాన్ని వరద నీరు చుట్టుముట్టినప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అభినందనీయమని వరద బాధితులు కొనియాడుతున్నారు. 

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హుదుద్ తుఫాన్ వచ్చిందని, ఆ సమయంలో ఆయన అక్కడే ఉండి వైజాగ్​ను మళ్లీ పునర్ నిర్మాణం చేశారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు విజయవాడ ముంపుకు గురైనందున చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ వరద పరిస్థితిని సమీక్షిస్తూ తమను కాపాడేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. తమకు ఇబ్బందులు లేకుండా అన్ని సమకురుస్తున్నారని  బుడమేరు వరద ముంపు బాధితులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.