నాలుగో తేదీన అసలైన ఫలితాలు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా : కేటీఆర్ - KTR On EXIT Polls 2024 - KTR ON EXIT POLLS 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 10:44 PM IST
BRS Working President KTR On Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా నాలుగో తేదీన ఫలితాల వచ్చిన రోజు అన్ని విషయాలు మాట్లాడతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో 14 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరూ పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. ఎంతోమంది బలిదానాలకు పాల్పడితే గానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బిడ్డగా దశాబ్ది ఉత్సవాలు గర్వంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అమరుల స్మృతిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించామని, పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అమర వీరుల స్థూపమైన గన్‌పార్క్ నుంచి ర్యాలీ నిర్వహించామని ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సబ్బండ వర్గాల వారు పోరాడితేనే సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు.