LIVE : తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియా సమావేశం - KTR Press Meet From TG Bhavan - KTR PRESS MEET FROM TG BHAVAN
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 10:42 AM IST
|Updated : Sep 17, 2024, 10:49 AM IST
KTR Press Meet From Telangana Bhavan Live : : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సెప్టెంబరు 17కు కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నది. గతంలో కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలానే తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పలువురు పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించి, కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
Last Updated : Sep 17, 2024, 10:49 AM IST