చెన్నూరులో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్‌ - KTR Election Campaign - KTR ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 5:17 PM IST

KTR Election Campaign In Chennur : లోక్‌సభ ఓటింగ్‌ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఫుల్‌ బిజీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో  పాల్గొని ప్రసంగించారు. 

దళిత బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం : చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ముగిసిన అనంతరం దళిత బీఆర్ఎస్ కార్యకర్త ప్రశాంత్ ఇంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేయడం ప్రత్యేకత సంచరించుకుంది. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​తో కలిసి భోజనం చేసినా అనంతరం ప్రశాంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫోటోలు దిగారు. అంతకుముందు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​కు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.