ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవాలనే ఈడీతో కేంద్రం దాడులు చేయిస్తోంది : బీఆర్ఎస్ ఎంపీలు - BRS MPs on MLC Kavitha Arrest
🎬 Watch Now: Feature Video
Published : Mar 22, 2024, 7:54 PM IST
BRS MPs about MLC Kavitha Arrest : దేశంలోని ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చి, లొంగదీసుకోవాలనే దురుద్దేశంతోనే ఈడీ(ED)తో కేంద్రం దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. ప్రభుత్వప్రాధాన్యాలకు అనుగుణంగా విధానాలు మారుతాయన్న నేతలు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితని అరెస్టు చేసినట్లు పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రాలకే పరిమితం చేసిన దాడులను, పార్లమెంట్ పోరు నేపథ్యంలో దేశ రాజధానికి తరలించారని ఆరోపించారు.
BRS MPs Fire on PM Modi : శక్తి పేరిట అతివలను అవమానపరుస్తున్నారని, విపక్షాలపై విరుచుకు పడుతున్న ప్రధాని మోదీ, మహిళ అని చూడకుండా కవితను రాత్రిపూట ఎలా అరెస్టు చేయించారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై దాడులు చేయడం సబబు కాదని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వని వాళ్లపైనే కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తుందని విమర్శించారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, కవిత అరెస్టుపై న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.