ఎన్నికల ప్రచారంలో రయ్ రయ్ అంటూ ఆటో నడిపిన నామ నాగేశ్వరరావు - Nama Nageswararao Election Campaign - NAMA NAGESWARARAO ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 7:39 PM IST
BRS Mp Candidate Nama Nageswara Rao Auto Driving : సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులే ఉండటంతో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. ఖమ్మం పట్టణంలోని ప్రజలు అధికంగా ఉండే ప్రదేశాల్లో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. నగరంలోని పాత బస్టాండ్‌లో ఆయన ఇవాళ క్యాంపెయిన్ నిర్వహించారు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి దండం పెట్టి, ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలతో కలిసి ఓటు అడిగి సెల్ఫీ దిగి ఉత్సాహపరిచారు.
BRS MP Election Campaign : అంతకు ముందు బస్టాండ్ ఎదుట ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వెళ్లారు. పలువురు ఆటో కార్మికులతో కలిసి మాట్లాడారు. ఆటో ఎక్కి ఆటోను స్టార్ట్ చేసి ముందుకు దూసుకుపోయారు. కాసేపు ఆటో నడిపిన అనంతరం వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మెుదలైందన్న నామ నాగేశ్వరరావు, గులాబీ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలు కోరారు.