నాకు వందల ఎకరాల భూమి ఉంది, డబ్బు మీద ఆశలేదు : క్యామ మల్లేష్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 9:55 AM IST
BRS MP Candidate Kyama Mallesh Campaign In Bhuvanagiri : తనకి డబ్బు మీద ఆశలేదని 100 ఎకరాల భూమి ఉందని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. ఎంపీ అభ్యర్థిగా నియమించాకా తొలిసారి భువనగిరికి వచ్చిన మల్లేష్‌కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భువనగిరి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే భువనగిరి పేరును కీర్తి పథకాన నిలపడానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశానని తెలిపారు.
Telangana Lok Sabha Elections 2024 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ అడిగానని కానీ ఎంపీ టికెట్ ఇస్తానని మాట ఇచ్చారని ఆమేరకు భువనగిరి ఎంపీ టికెట్ నాకు కేటాయించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలేదని విమర్శించారు. ఓటు హక్కు ఏకే 47 గన్ కంటే గొప్పదని, ఓటు హక్కు ఎవరికైనా సమానమేనని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు గొంగిడి సునీత, గాదరి కిషోర్ హాజరయ్యారు.