LIVE: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల - ప్రత్యక్ష ప్రసారం - MLC Kavitha Release from Tihar Jail - MLC KAVITHA RELEASE FROM TIHAR JAIL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 9:03 PM IST
|Updated : Aug 27, 2024, 9:24 PM IST
BRS MLC Kavitha Release from Delhi Tihar Jail : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆమె తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, వారు పూచీకత్తును కోర్టుకు సమర్పించారు. అలాగే సాక్షులను ప్రభావితం చేయరాదని తెలిపారు. పాస్‌పోర్టు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటన్నింటికీ ఒప్పుకున్న పిటిషనర్ కవిత అన్ని నిబంధనలను పూర్తిగా కంప్లీట్ చేసి జైలు నుంచి విడులయ్యారు. ఈ ఏడాది మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవిత 5 నెలలకు పైగా తీహాడ్ జైలులోనే ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణలు ఆనందంలో మునిగిపోయారు. టపాయలు పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు.
Last Updated : Aug 27, 2024, 9:24 PM IST