LIVE : గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా - BRS Leaders Protest at Gunpark - BRS LEADERS PROTEST AT GUNPARK
🎬 Watch Now: Feature Video
Published : Aug 2, 2024, 6:21 PM IST
|Updated : Aug 2, 2024, 6:46 PM IST
BRS MLAs Protest At Gun Park : గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ ధర్నా చేస్తున్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ నిరసన వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు వేయించారని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరామన్నా ఆయన కనీసం 2 నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని విమర్శించారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అనర్హత వేటు ఎదురుక్కొంటున్న వ్యక్తికి మైకు ఇచ్చి తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యువత తరఫున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కొత్తగా నవ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, రేవంత్ అశోక్‌నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేస్తుందని హెచ్చరించారు.
Last Updated : Aug 2, 2024, 6:46 PM IST