50 రోజుల్లో 50 వేశాలు వేశారు - కాంగ్రెస్ పాలన ఉన్నా, లేకున్నా ఒకటే : మల్లారెడ్డి - Malla Reddy in election campaign
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20657029-thumbnail-16x9-malla-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 3, 2024, 2:20 PM IST
BRS MLA Malla Reddy At Kondagattu Temple : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేత పూజలు చేసిన ఆయన, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణలోని అన్ని దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు.
కొండగట్టు దేవాలయం రూ.100 కోట్లతో అభివృద్ధి జరిగందన్నారు. తరువాత మరో రూ.500 కోట్లు విడుదల చేసి, మరింత అభివృద్ధ చేస్తామని చెప్పామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నా, లేకున్నా ఒకటే అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ 56 ఏళ్లు పాలించిందని, కానీ తెలంగాణకు ఎప్పుడూ న్యాయం చేయలేదని మండిపడ్డారు. 50 రోజుల్లో 50 వేశాలు వేశారని, కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీఆర్ఎస్కు 16 సీట్లు రావాలని దేవుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు.