LIVE : బీఆర్ఎస్ఎల్పీ వద్ద మీడియాతో మాట్లాడుతున్న హరీశ్ రావు - Harish Rao Live at Mediapoint - HARISH RAO LIVE AT MEDIAPOINT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2024/640-480-22045497-thumbnail-16x9-harish.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 25, 2024, 4:06 PM IST
|Updated : Jul 25, 2024, 4:45 PM IST
Harish Rao Live at Assembly Mediapoint : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీ విలీనం, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాజీమంత్రి హరీశ్ రావు ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Jul 25, 2024, 4:45 PM IST