కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి : పల్లా రాజేశ్వర్ రెడ్డి - BRS Leaders Met Prabhakars Family - BRS LEADERS MET PRABHAKARS FAMILY
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 4:54 PM IST
BRS Leaders Visited Farmer Prabhakars Family In Khammam : ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ రావు కుటుంబాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పరామర్శించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకూ రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారికి సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారణం ముమ్మాటికీ ప్రభుత్వం, అధికారులేనని ధ్వజమెత్తారు. చనిపోయిన రైతు కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.2 లక్షల పరిహారాన్ని అందించారు.