LIVE : మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలతో బీఆర్​ఎస్​ బృందం సమావేశం - BRS leaders meet Musi front live - BRS LEADERS MEET MUSI FRONT LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 11:13 AM IST

Updated : Sep 29, 2024, 12:16 PM IST

BRS Leaders Visit Musi River Front Live : మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ పర్యటించారు. మాజీ మంత్రులు హరీశ్​ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసీ బాధితుల ఇళ్లును వారు పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. బీఆర్​ఎస్​ పార్టీ తరఫున న్యాయపరంగా బాధితుల తరఫున పోరాటం చేస్తామని బృంద సభ్యులు తెలిపారు. బాధితుల ఇళ్లను క్షేత్రస్థాయిలో బీఆర్​ఎస్​ బృందం పరిశీలించింది. ముందుగా హైదర్​షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం తెలంగాణ భవన్​లో హైడ్రా బాధితులు బీఆర్​ఎస్​ నేతలను కలిశారు. ఈ క్రమంలో వారికి మాజీ మంత్రి హరీశ్​రావు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సీఎంకు లేదని హరీశ్​ రావు విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారంటూ ప్రశ్నించారు. అందుకే బాధితులకు రక్షణ కవచంలాగా బీఆర్​ఎస్​ ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్​ఎస్​ లీగల్​ బృందం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిన్న ఇచ్చిన హామీ మేరకు నేడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం హైడ్రా బాధితులతో బీఆర్​ఎస్​ బృందం మాటామంతి నిర్వహించారు.
Last Updated : Sep 29, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.