ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి - వారికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చండి : శ్రీనివాస్ గౌడ్ - BRS Leader Srinivas Goud - BRS LEADER SRINIVAS GOUD
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 8:00 PM IST
BRS Leader Srinivas Goud Fires on Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడిచినా, ఉద్యోగులకు ఏమీ చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లులు కూడా సక్రమంగా అందడం లేదని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఓపీఎస్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఆయన, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. పోలీస్ శాఖలో ఒకే విధానం ఉండాలని అన్నారు. పెన్షనర్లకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వానికి కొంత మంది ఉన్నతాధికారులు సహకరించలేదని, అందుకే బదిలీల్లో ఇబ్బందులు వచ్చాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కంటే బాగా పాలన చేస్తారని ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్న ఆయన, ప్రకటించిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదన్న మాజీ మంత్రి, తనను ఓడించేందుకు మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని అన్నారు.