LIVE : పటాన్​చెరు​లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ రోడ్​ షో - KCR Road Show Live - KCR ROAD SHOW LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 7:34 PM IST

Updated : May 8, 2024, 9:50 PM IST

BRS Chief KCR Road Show Live : బీఆర్ఎస్​ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వరుస బస్సుయాత్రలు, రోడ్​షోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ బస్సుయాత్రలో భాగంగా నర్సాపూర్​ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీశ్రేణులు, ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్​, బీజేపీలపై విమర్శలవర్షం కురిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయంటున్నారు. బీఆర్​ఎస్ పాలనలో ఒక్కసారైనా నీటి, కరెంటు కొరత వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేసి బీఆర్ఎస్​ విజయానికి పనిచేయాలని సూచిస్తున్నారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్​లు చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఇప్పటివరకు దానిని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.
Last Updated : May 8, 2024, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.