LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రెస్మీట్ - BRS Chief KCR Press Meet - BRS CHIEF KCR PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 2:04 PM IST
|Updated : May 11, 2024, 3:37 PM IST
BRS Chief KCR Press Meet : లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం కానుంది. ఎన్నికల కోసం బస్సుయాత్ర ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శనివారం తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. 17 రోజుల పాటు 13 నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా ప్రచారం సాగించారు. చివరిరోజైన నేడు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలను కేసీఆర్ వివరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేయెద్దని ఎన్నికల ప్రచారం కేసీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమికి పార్లమెంటులో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతామని చెప్పారు. ఓటర్లు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వివరించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తన వ్యూహాలను అమలు చేశారు.
Last Updated : May 11, 2024, 3:37 PM IST