LIVE : నాగర్ కర్నూల్ రోడ్డు షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్ - KCR Nagarkurnool Election Campaign - KCR NAGARKURNOOL ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 27, 2024, 7:57 PM IST
|Updated : Apr 27, 2024, 8:32 PM IST
BRS Chief KCR Nagarkurnool Election Campaign : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పోరుబాట బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న కేసీఆర్, ఆ రాత్రికి మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీనివాస్ గౌడ్ ఫాంహౌజ్‌లోనే బస చేశారు. నేడు మహబూబ్‌నగర్ నుంచి నాగర్ కర్నూల్ బయలుదేరి వెళ్లారు. కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజు ఉయ్యాలవాడ నుంచి నాగర్ కర్నూల్ బస్టాండ్ వరకు జరిగిన రోడ్డు షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బస్టాండ్ కూడలి వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం గురించి, ప్రస్థానం, రాష్ట్రాభివృద్ధిలో పార్టీ పాత్రపై కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్డు షోలో పాల్గొని తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనని, పోరాటం చేస్తానంటూ స్పష్టం చేశారు.
Last Updated : Apr 27, 2024, 8:32 PM IST