LIVE : హైదరాబాద్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర - ప్రత్యక్షప్రసారం - BJP Vijaya Sankalp Yatra Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2024, 1:35 PM IST
|Updated : Feb 26, 2024, 1:45 PM IST
BJP Vijaya Sankalp Yatra Hyderabad : రాష్ట్రంలో అధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 క్లస్టర్లలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు విస్తృతంగా యాత్రల్లో పాల్గొని శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. అందుకే మరోసారి బీజేపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని పునరుద్హాటించారు. తొమ్మిదేళ్ళ తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తాజాగా నేడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన భాగ్యనగర్ పార్లమెంట్ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రకు కిషన్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.ఈ యాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు.
Last Updated : Feb 26, 2024, 1:45 PM IST