బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి - శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీలు - BJP MPs CONGRATULATES BANDI SANJAY - BJP MPS CONGRATULATES BANDI SANJAY
🎬 Watch Now: Feature Video
Published : Jun 10, 2024, 2:02 PM IST
BJP MPs Wishes to Central Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు దిల్లీలో సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కూడా సంజయ్‌ను కలిసి విషెస్ చెప్పారు. అనంతరం ఎంపీలు ఈటల రాజేందర్, రఘనందన్ రావులను బండి సంజయ్ శాలువాతో సత్కరించారు.
Bandi Sanjay Speech After Central Minister : తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. కేంద్రంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బండి రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర పదవి దక్కించుకున్న బండి ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా కొనసాగుతున్నారు.