'కేంద్రం నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాననడం విచారకరం' - BJP mp Laxman on Tg Liberation Day - BJP MP LAXMAN ON TG LIBERATION DAY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 12:36 PM IST

BJP Leader Laxman Visit Pared Ground : కేంద్రం నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాననడం విచారకరమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. మజ్లిస్​కు తలొగ్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్​కు కూడా కేసీఆర్​కు పట్టిన గతే పడుతుందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఎందుకు విమోచన దినమని పలకడం లేదని ప్రశ్నించారు. మొక్కుబడిగా కాకుండా తెలంగాణకు ఉన్న చరిత్ర భావితరాలకు అందించాలని అన్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవం మాదిరిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ భావాలను పెంపొందించడానికి ప్రధాని మోదీ మూడేళ్లుగా కృతనిశ్చయంతో విమోచన దినోత్సవం జరిపిస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్స్​తో పాటు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. లక్ష్మణ్‌తో పాటు మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్​సింగ్ రాఠోడ్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.