యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నా: సైదిరెడ్డి - Lok Sabha Election 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 20, 2024, 10:43 AM IST
BJP MP Candidate Saidi Reddy Fires on Congress : ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో నడుస్తోందని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఇంటింటికీ వెళ్లి తమ మేనిఫెస్టోను వివరిస్తామని పేర్కొన్నారు.
నల్గొండలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోదీ గెలుపు, నల్గొండలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి.