దేశ సమగ్రత, భద్రత కోసం మోదీని మళ్లీ గెలిపించాలి : శానంపూడి సైదిరెడ్డి - LOk Sabha polls 2024 - LOK SABHA POLLS 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-04-2024/640-480-21213649-thumbnail-16x9-bjp-mp-cand.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 13, 2024, 2:18 PM IST
BJP MP Candidate Saidi Reddy Election Campaign : బీజేపీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గమనిస్తున్నారని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. కాషాయ పార్టీ హయాంలో దేశ జీడీపీ పెరిగిందన్నారు. దేశ సమగ్రత, భద్రత కోసం మోదీని మళ్లీ గెలిపించాల్సిన అవసర ఉందని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వారితో సైదిరెడ్డి ముచ్చటించారు.
ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని స్థానికులను కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలోనూ ప్రచారం చేశారు. యువతతో సరదాగా క్రికెట్, షటిల్ ఆడి ఉత్సాహపరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆవశ్యకత వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు.
కాంగ్రెస్ అగ్ర నేతలను తీసుకొచ్చి, ఆరు గ్యారెంటీలని అబద్ధాలు చెప్పించి, ఏ ఒక్క దాన్ని నిజం చేయకుండా అన్నీ అబద్ధాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా, అప్పులు ఉన్నాయని దాట వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల రాజ్యంగా మారిందని, పర్సంటేజ్‌లు, టాక్స్‌ల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.