ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు - Palvai Harish Babu On Projects - PALVAI HARISH BABU ON PROJECTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-07-2024/640-480-22083324-thumbnail-16x9-palvi.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 30, 2024, 2:46 PM IST
Palvai Harish Babu On Projects : ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద కక్షకట్టారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఎవరైనా చెప్పడమంటే మోసపూరితమైనదేనని వార్ధా లేదా తుమ్మిడిహెట్టీ వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని అన్నారు. ఈ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలందం కలిసి కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌కు రైస్ మిల్లర్లు రూ.53వేల కోట్లు బకాయి ఉన్నారని సంబంధిత శాఖ మంత్రి చెప్పారని రూ.3 వేల కోట్లు రికవరీ చేస్తున్నామని మంత్రి చెబుతున్నారని ఆక్షేపించారు. ఈ అంకెల గారడీ మధ్య ఉన్న మతలబు ఏంటో అర్థం కావటం లేదన్నారు.