డైరెక్ట్‌గా సీఎం కావడంతో రేవంత్‌రెడ్డికి సరైన అవగాహన లేదు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి - BJP MLA Alleti on Budget - BJP MLA ALLETI ON BUDGET
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 4:28 PM IST
MLA Alleti Maheshwar Reddy on Union Budget : అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, తమను విస్మరిస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మంత్రి శ్రీధర్‌బాబు మాటలు సరికాదని, రూ.4 వేల కోట్ల నిధులు సీఎం సొంత నియోజకవర్గానికి కేటాయించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాల ప్రాధాన్యత ఉండదని, ఫెడరల్ స్ట్రక్చర్‌లో భాగంగానే నిధుల కేటాయింపులు చేస్తారని పేర్కొన్నారు. డైరెక్ట్‌గా సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ఆ రాష్ట్ర ప్రస్తుత, గత ముఖ్యమంత్రులు కోరారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు కేటాయించినప్పుడు, మిగతా జిల్లాల వారు చర్చకు డిమాండ్ చేస్తే దానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల నిధులు ఇచ్చారని, ఇప్పుడు రూ.80 వేల కోట్ల ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి బానిసగా మారుతున్నారని ఎద్దేవా చేశారు.