LIVE : బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం - BJP MLA Alleti Live - BJP MLA ALLETI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jul 6, 2024, 12:13 PM IST
|Updated : Jul 6, 2024, 12:19 PM IST
BJP MLA Alleti Maheshwar Reddy Press meet Live : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు శనివారం ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలు సైతం పలు సూచనలు చేస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీనిపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఇప్పటికే బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. తిరుమల పవిత్రత కాపాడాలని ఏపీ సీఎంకు లేఖ రాశామని చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరనున్నారు.
Last Updated : Jul 6, 2024, 12:19 PM IST