జగనన్న బడుగు వికాసం పేరుతో మోసం! - సబ్సిడీని వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన - jagananna badugu vikasam subsidy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 4:50 PM IST

BJP Leaders Agitation Against CM YS Jagan: నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టాక మోసపూరిత వైఖరి అవలంభిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. జగనన్న బడుగు వికాసం పేరుతో ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను మోసగించారని ఆయన ఆరోపించారు. నెల్లూరు పరిశ్రమల శాఖ కార్యాలయం ఎదుట బడుగు వికాస పథకం సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా నిరసన చేపట్టింది. 

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న 27 పథకాలను రద్దు చేసిన జగన్, తాను దళిత, గిరిజనుల కోసమే అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా వాహనాలు తీసుకున్న ఎస్సీలు, ఎస్టీలు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద 45 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ మొత్తాన్ని విడుదల చెయ్యకపోవడం దారుణమన్నారు. సబ్సిడీని వెంటనే విడుదల చెయ్యకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.