LIVE: వెంకంపేటలో నితిన్ గడ్కరీ బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - Nitin gadkari public meeting live - NITIN GADKARI PUBLIC MEETING LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 1:20 PM IST
|Updated : May 2, 2024, 1:35 PM IST
Bjp Leader Nitin gadkari public meeting live : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీలు సైతం మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడంతో ఆ హామీలను ఓటర్లకు వివరించడంతో దూసుకుపోతున్నారు. వీరికితోడుగా జాతీయ నేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే ఆ పార్టీ కీలక నేత నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. నేతల షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. BJP Leaders Andhra Pradesh Tour : నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మండలం వెంకంపేటలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం
Last Updated : May 2, 2024, 1:35 PM IST