LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం - bjp kishan reddy live
🎬 Watch Now: Feature Video
Published : Feb 11, 2024, 4:20 PM IST
|Updated : Feb 11, 2024, 4:38 PM IST
BJP Kishan Reddy Press Meet LIVE : పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా భాజపా విజయ సంకల్ప యాత్రలకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 29 వరకు యాత్రలను నిర్వహించనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా భాజపాపేర్లు పెట్టింది. భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకి భాగ్యనగరమని నామకరణం చేశారు. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని. అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరు పెట్టారు. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా. వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేర్లు పెట్టారు. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రణాళికపై ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.