మూసీ ప్రక్షాళన పేరుతో నిధుల దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ : కిషన్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Kishan reddy on Musi Development Project : హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంత భూములు కబ్జాలకు గురికావడమే గాక, ఆ భూముల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాత్రివేళలో ట్రక్కులతో మట్టిపోసి మూసీని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ఎంపీ నిధులతో నిర్మించిన ప్రేమ్‌నగర్, బూర్జుగల్లీలలో పవర్ బోర్‌ను, భరత్‌నగర్‌లో కమిటీహాల్‌కు అయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.3500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాజకీయ లబ్ధికోసం 111జీవో ఎత్తివేశారని ఆరోపించారు. దీనివల్ల బడా రియాల్టర్లే లాభపడ్డారని, పేదప్రజలకు ఎటువంటి ఉపయోగం జరగలేదన్నారు. భూకబ్జాదారులు వందల ఎకరాల పేదల భూములను ఆక్రమించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూసీని ప్రక్షాళన(Musi Development Project) చేసి నది పరివాహక ప్రాంతాలలో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.