అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలు చేస్తారా? : మాధవీలత - Madhavi latha on Owaisi - MADHAVI LATHA ON OWAISI
🎬 Watch Now: Feature Video
Published : Apr 19, 2024, 4:45 PM IST
BJP MP Candidate Madhavi latha on Owaisi : హైదరాబాద్ పాతబస్తీని చూస్తే కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయని, ఇక్కడ ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పేర్కొన్నారు. ఇవాళ మలక్ పేట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆమె, అమాయక ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ఓవైసీ బ్రదర్స్ చూస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు దరిచేరనీయకుండా అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నారని ఆరోపించారు.
రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాధవీలత తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడానికి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ లేదని, అసదుద్దీన్ ఓవైసీ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు విద్య, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పాతబస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టం చేశారు.