LIVE : మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియా సమావేశం - ETELA RAJENDER PRESS MEET LIVE - ETELA RAJENDER PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 12:15 PM IST
|Updated : May 7, 2024, 1:20 PM IST
Bjp Candidate Etela Rajender Press Meet Live : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హామీల కోసం దేవుళ్ల మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ఇప్పుడు సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లేనని విమర్శించారు.ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
Last Updated : May 7, 2024, 1:20 PM IST