దేశంలో జరుగుతున్న కీలక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మోదీని బలపర్చాలి : ధర్మపురి అర్వింద్ - BJP Candidate Aravind Press Meet - BJP CANDIDATE ARAVIND PRESS MEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 1:49 PM IST

BJP Aravind Comments On Congress : దేశంలో జరుగుతున్న కీలక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మోదీని బలపర్చాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్​లో మీట్ ది ప్రెస్​లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​పై నిప్పుల వర్షం కురిపించారు. మోసపూరితమైన హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశం అభివృద్ధి దిశగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మోదీ హయాంలో రైళ్లు, రోడ్డు రవాణా వ్యవస్థ ఊపందుకుందని, కేంద్ర పథకాలు మతపరంగా లేవని అందరికీ వర్తిస్తాయని చెప్పారు.

బీజేపీ దేశ ఉన్నతి కోసం పని చేస్తుంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్​లు కుల రాజకీయాలు చేస్తున్నాయని అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ రెండో స్థానానికే పరిమితమని, బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడా డిపాజిట్లు దక్కవని అన్నారు.  ప్రతి ఒక్క ఓటరు విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం సూచనలు అధికారులు పాటించాలని అర్వింద్‌ కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.