మోదీ ప్రమాణ స్వీకారంతో బీజేపీ శ్రేణుల సంబరాలు - పలు ప్రాంతాల్లో ర్యాలీలు - Modi Third Term PM BJP Activists Celebrations - MODI THIRD TERM PM BJP ACTIVISTS CELEBRATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 10:23 AM IST

BJP Activists Celebrated as Modi Oath PM For Third Term: భారత ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శాంతి నగర్‌ నుంచి లక్ష్మీ బజార్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి కేక్‌ కట్‌ చేసి టపాసులు కాల్చారు. గుంతకల్లులో మొదట పట్టణ శివారులోని అంజేయస్వామి విగ్రహానికి పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. హనుమాన్ సర్కిల్ నుంచి మార్కెట్లోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీ చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్​కు జై కొడుతూ నినాదాలు చేశారు. 

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ ర్యాలీలో పాల్గొని యువకులను ఉత్సాహపరిచారు. కర్నూలులో బీజేపీ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. మోదీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని వచ్చే ఐదు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.