న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన - Bhupalpally Man Photo on New York - BHUPALPALLY MAN PHOTO ON NEW YORK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 6:46 PM IST

Bhupalpally Photographer Photo on New York Time Square : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఫొటోగ్రాఫర్ డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్​పై మెరిసింది. ఎన్​ఎఫ్​టీ ఎన్​వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్​లైన్​లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫొటోలు పోటీ పడగా, ఆయన తీసిన చిత్రం టైం స్క్వేర్ బిల్ బోర్డ్​పై మంగళవారం రాత్రి నుంచి ప్రదర్శితమవుతున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  

Telangana Photographer photo in New york : నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని అరుణ్ కుమార్ తెలిపారు. గత డిసెంబర్​లో ప్రధాని మోదీ ఆయన తీసిన ఫొటోల గురించి మన్​కీ బాత్​లో ప్రస్తావించారని చెప్పారు. తన తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతో ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫొటోగ్రఫీ పోటీల్లోనూ ఇటీవల ఆయన బహుమతి అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.